మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రాజును తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటియు) నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ను ఘనంగా సన్మానించి మొక్కను అందచేశారు. ఈ సందర్బంగా సీఐటియు నాయకులు మాట్లాడారు.
మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ గద్దె రాజు కార్మికుల వహిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల రాజలింగు, క్యాతనపల్లి మున్సిపల్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు యం.మహేందర్, ఐలన్న, నాయకులు రమేష్, తిరుపతి, రాజు, రాజయ్యలు పాల్గొన్నారు.