22-04-2025 11:38:38 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నదీమ్ ను తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు మీర్జా సలీం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. సందర్భంగా మైనార్టీల అభివృద్ధి, ఉర్దూ భాషాభివృద్ధి,స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మజీద్ ఇక్బాల్, కోశాధికారి ఫయాజుద్దీన్, సభ్యులు సాజిద్ ఖాన్, మనోహర్ ఖాన్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.