calender_icon.png 28 January, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేటలో పరువు హత్య

27-01-2025 11:01:32 AM

హైదరాబాద్: సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన మాల కృష్ణ అలియాస్ బంటి అనే యువకుడు సోమవారం ఉదయం పిల్లలమర్రి వద్ద ఇరిగేషన్ ట్యాంక్ బండ్ దగ్గర హత్యకు గురయ్యాడు. నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్ పక్కన కృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అతను ఆరు నెలల క్రితం భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే కృష్ణపై భార్గవి సోదరుడు పగతో ఉన్నాడు. కృష్ణ పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. ప్రేమ పెళ్లే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆధారాలు సేకరించి మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. యువకుడ్ని బండ రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.