06-07-2024 12:35:33 AM
ప్రేమ వివాహం చేసుకుందని యువతి దారుణ హత్య
శవాన్ని కాల్చి పరారైన కుటుంబ సభ్యులు
జైపూర్, జూలై 5 : రాజస్థాన్‌లో పరువు హత్య జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతుర్ని సొంత కుటుంబీకులే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గురువారం రాజస్థాన్‌లోని ఝలావర్‌లో వెలుగు చూసింది. 24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. రవిభీల్ అనే వ్యక్తిని ఆమె ప్రేమ వివాహం చేసు కుంది. దీంతో, ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని గ్రహించిన యువతి, తన భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని గ్రామంలోని బ్యాంకు వద్దకు వారి ద్దరూ వస్తున్నారని సమాచారం అందడంతో అక్కడే తన కూతురిని కిడ్నాప్ చేయాలని కుటుంబ సభ్యులు ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం, భర్త ముందే కూతురిని కిడ్నాప్ చేశాడు. దారుణంగా హత్య చేసి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి పారిపోయారు.