calender_icon.png 31 March, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య

28-03-2025 10:21:12 AM

కూతురును ప్రేమించాడని జన్మదినం రోజునే సాయికుమార్ ను నరికి చంపిన తండ్రి

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామానికి చెందిన ఓ యువతిని సాయికుమార్, అనే యువకుడు ప్రేమించాడు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి తండ్రి సాయి కుమార్‌ను పలు మార్లు హెచ్చరించాడు. కాగా గురువారం సాయికుమార్ జన్మదినం కావడంతో సాయికుమార్ రాత్రి స్నేహితులతో వేడుకలకు సిద్దమైన సమయంలో మాటు వేసిన అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన సాయికుమార్‌ను స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్ ఆసుపత్రి(Sultanabad Hospital)కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున యువకుడు మృతి చెందాడు. ప్రేమించిన పాపానికి పరువు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ విచారణ చేపట్టారు. గ్రామంలో ఘర్షణ తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. యువతి తండ్రి చేతిలో హత్యకు గురికావడంతో స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.