calender_icon.png 29 April, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీపై వెళ్తున్న జడ్జికి సన్మానం

29-04-2025 01:10:37 AM

అర్మూర్, ఏప్రిల్ 28: ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా పని చేసిన వేముల దీప్తి ఆర్మూర్ నుండి ఖమ్మం జిల్లాకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా  జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు పలికారు.

ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతి పూలమాల, శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో డీజే దయానంద్, ప్రవీణ్ పవార్, జేస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.