21-03-2025 01:46:07 PM
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో శుక్రవారం నాడు గందరగోళం నెలకొనడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రభుత్వాన్ని సమర్థించుకున్నారు. కర్నాటక అసెంబ్లీలో హనీట్రాప్(Honeytrap scandal) దుమారం రేగింది. మంత్రులు సహా అనేకమంది హనీట్రాప్ లో చిక్కుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో హనీట్రాప్ వ్యవహారాన్ని కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కర్నాటక అసెంబ్లీ కార్యకలాపాలను బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.
సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాగితలు చించేస్తూ స్వీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. కొంతమంది సభ్యులు తమ చేతుల్లో సిడిలను కూడా పట్టుకుని, హనీ ట్రాప్ జరిగిందనే ఆరోపణలకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతూ సభలో హంగామా చేశారు. బీజేపీ సభ్యుల తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీట్రాప్ లో ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని కర్నాటక సీఎం హెచ్చరించారు. ఎవరినీ రక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. హనీట్రాప్ పై ఉన్నతస్థాయి కమిటీ విచారణకు హోంమంత్రి హామీ ఇచ్చారు.