22-03-2025 01:28:30 AM
న్యూఢిల్లీ, మార్చి 21: కర్ణాటక అసెంబ్లీలో వలపు వల (హనీ ట్రాప్) రగడ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారి తీసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే సీనియర్ మంత్రి కే రాజన్న చేసిన హనీ ట్రాప్ వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
హనీ ట్రాప్ బాధితుల్లో కేంద్ర నాయకులతోపాటు పలువురు న్యాయమూర్తులు కూడా ఉన్నారని స్వయంగా రా మంత్రే పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి సిద్దరా మయ్యను అశోక్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య స్పందించారు.
ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే సీఎం హామీతో బీజేపీ ఎమ్మెల్యేలు సంతృప్తి చెందలేదు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో 18 బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలలపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనల మధ్యే కర్ణాటక అసెంబ్లీ ఆ రాష్ట్ర ఆర్థిక బిల్లు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుతోపాటు శాసన సభ్యులకు జీతాలు పెంపునకు సంబంధించిన బిల్లును ఆమోద ముద్ర వేసింది.
ఇదిలా ఉంటే తనతోపాటు రాష్ట్రంలోని ఇతర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు సమా మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ వ్యవహరంలో బాధితులుగా ఉన్నట్టు ఆ కర్ణాటక సీ మంత్రి కే రాజన్న గురువారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సీఎం సిద్దరామయ్య హామీ
హనీ ట్రాప్ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్లపై కర్ణాటక ముఖ్య సిద్దరామయ్య స్పందించారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కొందరిని రక్షించ మరికొందరిని రక్షించకపోవడం అనే ప్రశ్నేలేదని.. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లేదా స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇలా ఎవరైనా సరే వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వందశాతం విచారణను నిర్వహించి, తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే సీఎం హామీకి శాంతించని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే హోం మంత్రి జీ పరమేశ్వర స్పందిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల సూచనను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
స్పష్టత కోసం ప్రతిపక్షనేత డిమాండ్
హనీ ట్రాప్ కుంభకోణం వ్యవహరంలో ప్రభుత్వం ఏ రకమైన విచారణను ఆదేశిస్తుం స్పష్టత ఇవ్వాలంటూ ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే సీఎం సిద్దరామయ్య మాత్రం ఈ అంశంపై స్పం 2025 సంవత్సరానికి సం రాష్ట్ర బడ్జెట్‌పై చర్చను కొనసాగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లారు.
ప్రభుత్వమే హనీ ట్రాప్ రాకెట్‌ను నడుపుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేయడంతోపాటు కాగితాలు ఎగరేసి, నిరసన తెలియజేశారు. ఈ గందరగోళం మధ్యే బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో.. న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలలపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.
ముస్లిం కోటా బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఓకే
18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను బీజేపీ సస్పెండ్ చేసిన అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును న్యాయ, పార్లమెంటరీ వ్యవహారశాఖ మంత్రి హెచ్‌ఐకే పాటిల్ సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు దానికి ఆమోదం తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లును బీజేపీ ఎమ్మెల్యేలు ముస్లిం కోటా బిల్లుగా భావించి ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి, బిల్లుకు సంబంధించిన కాగితాలను చించివేశారు.
ఎమ్మెల్యేల జీతాల పెంపునకు ఆమోద ముద్ర
తీవ్ర నిరసనల మధ్యే ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్ల పెంపునకు ప్రతిపాదించిన బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100శాతం మేర పెరగనున్నాయి. ఈ సందర్భంగా జీతాల పెంపునకు సంబంధించిన బిల్లును కొందరు సభ్యులు వ్యతిరేకించగా ప్రభుత్వం మాత్రం సమర్థించుకుంది.