18-04-2025 01:02:54 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని సెయింట్ జాన్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఎం. హనీ గిన్నీస్ వరల్ రికార్డ్సో్త చోటు దక్కించుకుంది. ‘వాల్లేట్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన క్రిస్టియన్ బృంద సంగీత విభావరిలో 1046 మంది పాల్గొనగా, పియానో వాయి ద్య పరికరంతో ఒక గంటలో అత్యధిక ప్రదర్శనలు చేసిన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు.
వీరిలో ఎం. హనీ చోటు దక్కించుకున్నారు. ఇందుకుగాను వై హెదరాబాద్ లోని మణికొండ షేక్పేట హుడా కాలనీ లైస్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రదర్ అనిల్ కుమార్, సంగీత గురువు పాస్టర్ అగస్టిన్, దండంగి వేణుగోపాల్ నుంచి హనీ గిన్నీస్ వరల్ రికార్డును అందుకున్నారు. గిన్నీస్ వరల్ రికార్డులో భాగమైనందున ఎంతో గర్వకంగా ఉందని హనీ తెలిపారు. ఈసందర్భంగా ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సంగీత గురువు పాస్టర్ అగస్టీన్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.