calender_icon.png 22 September, 2024 | 1:17 PM

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

26-07-2024 12:05:00 AM

  • రూ.2 లక్షలున్న బ్యాగు బాధితుడికి అప్పగింత

నిర్మల్, జూలై 25 (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపో సిబ్బంది శభాష్ అనిపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు మరి చిపోయిన ఫోన్, రూ.౨ లక్షల నగదు బ్యాగును అందజేసి నిజాయితీ చాటుకున్నారు. నిర్మల్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తున్నది. నిజామాబాద్‌లో బస్సు ఎక్కిన సురేశ్ అనే వ్యక్తి రూ.౨ లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి దిగాడు. ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తుకువచ్చి వెంటనే బస్టాండ్‌కు వచ్చి ఆర్టీసీ అధికారులను కలిశాడు. అప్పటికే బ్యాగును గుర్తించిన కండక్టర్, డ్రైవర్ వైఎల్ రాజు, తాజోద్దిన్ దానిని అధికారులకు అప్పగించారు. అధికారులు బ్యాగును బాధితుడికి అందజేశారు.  

ఫోను అప్పగింత..

నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అప్రోస్ నిజాయితీని చాటుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తున్న బోథ్‌కు చెందిన లక్ష్మణ్ అనే ప్రయాణికుడు తన ఫోన్‌ను బస్సులోనే మరిచి దిగిపోయాడు. బస్సు డిపోకు వచ్చిన వెం టనే డ్రైవర్ ఫోన్‌ను గమనించి అర్టీసీ అధికారులకు అందించారు. అధికారులు గురు వారం లక్ష్మణ్‌కు రూ.25 వేల విలువైన ఫోన్ అప్పగించారు. నిజాయతీ చాటుకొన్న డ్రైవ ర్లు, కండక్టర్లు  డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, అధికారులు రాజశేఖర్ అభినందించారు.