19-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 18( విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ వైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి తన ల్యాప్ టాప్ బ్యాగును మర్చిపోయి దిగిపోయాడు. బ్యాగ్ మిస్ అయిన విషయాన్ని వెంటనే డిపోకు సమాచారం ఇచ్చాడు. ట్రాఫిక్ ఇంచార్జ్ భారతి, కానిస్టేబుల్ విజయలక్ష్మి డ్రైవర్ సహకారంతో బస్సులో పరిశీలించారు. లాప్టాప్ బ్యాగును గుర్తించి శుక్రవారం ప్రయాణికుడు అజయ్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు.