కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ల్యాప్ టాప్, సెల్ ఫోన్ బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు కండక్టర్ గుండా శ్రీనివాస్. డి ఎం విశ్వనాథ్ తెలిపిన వివరాలు ప్రకారం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చంద్రపూర్ నుండి ఆసిఫాబాద్ కు వస్తున్న శృతి తన బ్యాగు మర్చిపోయింది. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది డిఎంకు సమాచారం అందించారు. ఈ విషయం పై బాధితురాలు డిఎం దృష్టికి తీసుకురాగా ఆర్టీసీ సిబ్బంది ల్యాబ్ టాప్ సెల్ ఫోన్ తో కూడిన బ్యాగును శృతి తమ్ముడు శ్రావణ్ కు అప్పగించారు. నిజాయితీ చాటిన ఆర్టీసీ సిబ్బందిని పలువురు అభినందించారు.