calender_icon.png 5 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోమ్‌టౌన్.. జ్ఞాపకాల దొంతర

04-04-2025 12:00:00 AM

రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యా ద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో రూపొందింది ‘హోమ్‌టౌన్’. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌ను నవీన్ మేడారం, శేఖర్ మేడా రం నిర్మించారు. ఈ నెల 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ బృందం గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ “హోమ్ టౌన్’ సిరీస్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా  రూపొందించారు” అన్నారు. “మనలో చాలా మంది ఊరి నుంచి సిటీకి వచ్చిన వాళ్లమే. విదేశాలకు వెళ్లినా మనకంటూ ఓ ప్రత్యేక ప్రాంతం ఉంటుంది. అదే మన ఊరు. సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకా లను మర్చిపోలేం. అలాంటి భావోద్వేగా లన్నీ ‘హోమ్‌టౌన్’లో ఆకట్టుకుంటాయి” అని డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి పల్లె తెలిపారు.

నిర్మాత నవీన్ మేడారం మాట్లాడుతూ- “90స్:ఎ మిడిల్ క్లాస్ బయో పిక్’ తర్వాత మా సంస్థలో చేసిన మరో సిరీస్ ‘హోమ్ టౌన్‌” అని చెప్పారు. ఇంకా ఈ వేదికపై సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, నటీ నటులు ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అని రుధ్, అనీ, శ్రావ్య కూడా మాట్లాడి ఈ సిరీస్ టీమ్‌తో చేసిన జర్నీలో తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.