- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ
- త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం
- మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరం తర ప్రక్రియ, అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడత లో ఇంటి స్థలం ఉన్నవారికి, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సమీక్షించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇంజినీరింగ్ విభాగాన్ని సమకూర్చు కోవడం, ప్రతీ రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మా ట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు అరులైన లబ్ధిదారులకు సంబంధించిన నివాస స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేని వారి జాబితా.. రెండు జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు.
దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో 274 మంది ఇంజినీర్లు మా త్రమే ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజినీర్లు అవసరమని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
ఇతర ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు.. వంటి అంశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి సీఎస్‌కు సూచించారు.
గ్రేటర్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ఇందుకోసం వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలన్నారు.
ఈ పరీక్షకు సంబంధించిన విధివిధానాలను తక్షణమే రూపొందించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ర్టంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని అదనం గా మరో వెయ్యి మంది అవసరమున్న నేపథ్యంలో వారి ఎంపికకు కావాల్సిన ప్ర ణాళిక తయారు చేయాలని, ఎంపిక విధా నం పారదర్శకంగా ఉండాలని సూచించారు.
సమా వేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి.గౌతమ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎంఆర్‌వో డైరెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.