calender_icon.png 29 April, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న హెచ్‌ఎంఏటీ ఆధ్వర్యంలో హోమియో ఫెస్ట్

29-04-2025 12:05:13 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి) : హోమియో వైద్య పితామహుడు డా.శామ్యూల్ హానిమన్ 270వ జయంతి పురస్కరించుకొని, హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హెచ్‌ఎం ఏటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో హోమియో ఫెస్ట్ కార్యక్రమాన్ని ఈనెల 30న ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడి టోరియంలో జరుపుతున్నామని హెచ్‌ఎంఎటి హోమియో ఫెస్ట్ కార్య నిర్వాహక వర్గం డా.కె.గోపాలకృష్ణ, డా.జి. దుర్గాప్రసాద్‌లు తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా కె.ఎన్.ఆర్.ఆరోగ్య విశ్వవిద్యాల యం వైస్ ఛాన్సలర్ డా.పి.వి. నందకుమార్ రెడ్డి, సిబిఐ మాజీ ఉప సంచాలకులు వి.వి.లక్ష్మీనారాయణ హాజరు కానున్నారని వెల్లడించారు. హోమియో వైద్య విద్యార్థుల్లో క్లినికల్ సామర్ధ్యాలతో పాటు, సృజనాత్మక శక్తిని పోటీ తత్వాన్ని అలవాటు చెయ్యడమే ఈ హోమియో పెస్ట్ ఉద్దేశం అని తెలిపారు.

ప్రముఖ హోమియో వైద్యు డు, పూర్వ హోమియో అదనపు సంచాలకులు డా.జి. జనార్ధన్ రెడ్డి, గెస్చర్స్ ద్వారా హోమియోపతిక్ రెమెడీస్ సెలెక్ట్ చేసే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేస్తారని, అనంతరం ఇండోర్ నుండి వస్తున్న ప్రముఖ హోమియో వైద్యు డు డా.వైభవ్ జైన్ ఆగ్రో హోమియోపతిపై డా. ఎన్.రామయ్య స్మారక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.వేణు గోపాల్ గౌరీ, డా.మధు వారణాసి, డా.గౌత మ్, డా. చాముండేశ్వరి పాల్గొన్నారు.