హుజూర్ నగర్ (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన బిట్టు శ్రీవాణి, భర్త అరె రవి. చిలుకూరు మండలం ఆర్లిగూడెం వాసి అయిన తన భర్త హెడ్ కానిస్టేబుల్ సహకారంతో ఎటువంటి కోచింగ్ లేకుండా ఇటీవల ప్రకటించిన గురుకుల రిజల్ట్ లో సత్తాచాటి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ప్రస్తుతం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఉద్యోగం చేస్తుంది. కాగా ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ లో ఉద్యోగం సాధించారు.