calender_icon.png 20 January, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇవ్వాలి

20-01-2025 07:57:04 PM

దమ్మపేట (విజయక్రాంతి): ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చి న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, ఆమర్లపూడి రాము డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దమ్మపేట శివారులో గల మల్లారంలో నిలిపివేసిన డబుల్ బెడ్ రూమ్లలో నిరుపేద కుటుంబాలు డేరాలు వేసుకుని గత 15 రోజులుగా నివాసం ఉంటున్నారని వాటి మీద రెవెన్యూ పోలీసు వారి సహకారంతో దార్జన్యంగా ఖాళీ చేయించారని తెలిపారు. తక్షణమే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఆయన కోరారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న ప్రభుత్వం పేదల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు.

ఆయనతో పాటు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ కూడా మాట్లాడుతూ... నిరుపేదలు నష్టం చేసే ప్రభుత్వంకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇవ్వాలని, 12 వేల రూపాయల జీవన భృతి అందరికీ ఇవ్వాలని కోరారు. అమలు ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోకుండా వ్యవహరించాలని కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్ళి ప్రధాన డిమాండ్ లతో కూడిన మెమోరాండం తహసిల్దార్ వాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ పండూరి వీరబాబు, వగ్గేల ప్రసాద్, రక్కోల అనిల్ కుమార్, జుంజునూరి నాగరాజు, జుంజునురి ముక్తేశ్వరి, దాసరి సుజాత, జగదీష్ నాగరాజు, టి నాగవల్లి, గంగాధర నాగమణి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.