calender_icon.png 18 October, 2024 | 7:55 AM

ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య

18-10-2024 12:34:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ హోంగార్డ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. ఉప్పల్‌లోని వెంకటరెడ్డి నగర్‌లో నివాసముంటున్న వెంకట రమణయ్య(39) పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిసున్నాడు. ఆయన గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు సమా చారం. దీంతో అప్పులు తీర్చే మార్గం కనబడక గురువారం సాయంత్రం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.