13-04-2025 12:18:57 AM
*ఫర్నీచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్లలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంతో ఫర్నీచర్ తుడిస్తే సమస్య తగ్గుతుంది.
*స్టెయిన్‌లెస్ స్టీల్ సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే పని అయిన తర్వాత వెనిగర్‌లో ముంచిన స్పాంజ్‌తో శుభ్రం చేయ్యాలి.
*ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి.
*బాత్రూం గోడలపై సబ్బు నురగ మరకలు పడి అలాగే ఉండిపోతాయి. వాటిని తొలగించాలంటే అరకప్పు వంటసోడా, కప్పు వెనిగర్, రెండు కప్పుల వేడి నీళ్లు, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గోడలపై చల్లి బ్రష్‌తో బాగా రుద్దితే సరిపోతుంది.