calender_icon.png 23 October, 2024 | 11:08 AM

ఇంటి చిట్కాలు

03-10-2024 12:00:00 AM

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది. 

* చెంచా కాఫీ పొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మ తొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది. 

* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు కొన్ని రోజులకే మురికిగా, జిడ్డు పట్టినట్టుగా తయారవుతాయి. వీటిని శుభ్రం చేయడానికి పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి అరగంటాగి శుభ్రం చేస్తే సరిపోతుంది. 

* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే బాగా మెరుస్తాయి.