- నిబంధనలకు విరుద్ధంగా టెంపరరీ సర్వీసులు
- విద్యుత్ సంస్థ ఆదాయానికి గండికొడుతూ.. జేబులు నింపుకొంటున్న అధికారులు
- క్యాటగిరీ 8 నుంచి 1, 2 మార్పు
- టీజీఎస్‌పీడీసీఎల్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో అధికారుల లీలలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) బలోపేతానికి దోహదపడాల్సిన అధికారులే సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇప్పటికే అత్యధిక బిల్లులు వసూలు చేస్తున్నామని చెప్పుకునేందకు ఫేక్ చెక్కులను జమచేస్తూ, ఆ పై ఆ చెక్కుల సంగతి మర్చిపోయినట్టుగా సంస్థను మోసం చేస్తున్న వైనాన్ని ఇటీవల ‘విజయక్రాంతి’ పత్రిక బట్టబయలు చేసింది. తాజాగా విద్యుత్ సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టేలా బడాబాబులతో లాలూచీపడుతూ తమ సొంత జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం.
విద్యుత్ సంస్థలో టెంపరరీ సర్వీసులను ఆదాయం అధికంగా వచ్చే క్యాటగిరీ జాబితాలో చేర్చాల్సింది పోయి.. సొంత ప్రయోజనాలకు అనుగుణంగా పర్మినెంట్ సర్వీసుల క్యాటగిరీలో చేరుస్తూ టీజీఎస్‌పీడీసీఎల్ సెంట్రల్ సర్కిల్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారని సమాచారం.
టెంపరరీ సర్వీసులకు పర్మినెంట్ క్యాటగిరీ
హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని ఓ సెక్షన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన భవన యాజమానికి ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా మీటర్ల మంజూరును అధికారులు రిజెక్ట్ చేశారు. సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీహెచ్‌ఎంసీ నుంచి ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ తెచ్చేవరకు టెంపరరీ సర్వీసుల కింద దాదాపు 20కి పైగా మీటర్లు మంజూరు చేశారు.
వాస్తవానికి టెంపరరీ సర్వీసులకు క్యాటగిరీ 8 జాబితాలో కనెక్షన్ ఉంటుంది. కానీ సదరు మీటర్లకు విద్యుత్ అధికారులుం క్యాటగిరీ 2లో మంజూరు చేయడం విశేషం. రాంనగర్ డివిజన్‌లో ౨౦, ముషీరాబాద్ డివిజన్‌లో ౩౦కి పైగా ఇలాంటి కేసులు ఉన్నట్లు సమా చారం. ఎల్‌టీలో క్యాటగిరీ సాధారణ గృహ అవసరాలకు, క్యాటగిరీేొ2 నాన్ డొమెస్టిక్ లేదా కమర్షియల్ క్యాటగిరీలో సర్వీసు లు ఉంటాయి.
కానీ, ఎస్‌పీడీసీఎల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యాజ మానులతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో క్యాటగిరీ మార్పు చేసి మీటర్లను మంజూరు చేస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సీజీఎం స్థాయి అధికారి ఆదేశాలతో మంజూరు చేయాల్సిన టెంపరరీ సర్వీసులను కింది స్థాయి అధికారులే లావాదేవీల చాటున ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
చర్యలు శూన్యం..
హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని సైఫాబాద్ డివిజన్‌లో నిబంధనల ప్రకారం క్యాటగిరీ 8లో టెంపరరీ సర్వీసులు మం జూరు చేస్తుండగా.. ఆజామాబాద్ డివిజన్‌లో మాత్రం క్యాట గిరీ 2లో చేరుస్తున్నారు. దీంతో ఒకే సర్కిల్ పరిధిలో టెంపరరీ సర్వీసుల పట్ల రెండు రకాల విధానాలు అమలవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఆజా మాబాద్ డివిజన్‌లో టెంపరరీ సర్వీసుల పద్ధతిలో మీటర్లు మంజూరు చేయగా, గడువులోగా ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ అందజేయనందుకు అధికారులు నోటీసులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కానీ, టెంపరరీ సర్వీసులను క్యాటగిరీ నుంచి క్యాటగిరీ 2లోకి మార్చిన అధికారులపై చర్యలు తీసుకోకుం డా వదిలేయడం విశేషం.
విద్యుత్ సంస్థ ఆదాయానికి తీవ్ర నష్టం కలిగించే ఈ తరహా మోసాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పు డు సరిచూసుకొని అధికారుల తప్పిదాల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదాయానికి గండి
సాధారణంగా డొమెస్టిక్ క్యాటగిరీలో విద్యుత్ చార్జీలు రూ.2 నుంచి ప్రారంభమై యూనిట్ల వారీగా స్లాబ్ రేటుకు అనుగుణంగా రూ. 3, రూ. 4 ఆపై ఉన్నాయి. అదే క్యాటగిరీ-2 లో రూ.7 నుంచి ప్రారంభమైన వినియోగించిన విద్యుత్ ఆధారంగా రూ.8.50, నుంచి రూ.11 దాకా ఉంటుంది. కానీ, క్యాటగిరీ 8లో మాత్రం యూనిట్ ధర రూ.12 వరకు ఉంటుంది.
అయితే, ఆజామాబాద్ డివిజన్‌లోని పలు సెక్షన్లలో క్యాటగిరీ 8 (టెంపరరీ సర్వీసు)లను క్యాటగిరీ 1, 2 జాబితాలో చేర్చడంతో విద్యుత్ సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇందుకు గానూ... సదరు భవన నిర్మాణ యాజమానుల నుంచి విద్యుత్ అధికారులు వేలాది నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.