calender_icon.png 22 March, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'నక్సల్ ముక్త్ భారత్' దిశగా మరో పెద్ద విజయం: అమిత్ షా

20-03-2025 03:36:22 PM

మోదీ ప్రభుత్వం నక్సల్స్ పై కఠిన వైఖరి

2026 మార్చి 31 నాటికి నక్సల్ లేని భారత్

న్యూఢిల్లీ: నక్సల్ రహిత భారత్ దిశగా మరో పెద్ద విజయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సల్స్ పై కఠిన వైఖరి అవలంబిస్తోందని అమిత్ షా(Amit Shah) స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో గురువారం రెండు చోట్ల  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగలూరు పరిధి అండ్రి అడువుల్లో ఎదురుకాల్పుల్లో(Chhattisgarh Encounter) 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయి మృత్యువాత పడ్డారు. గంగలూరులో జరిగిన ఎదురుకాల్పుల్లో జవాను మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

"ఈ రోజు మన సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు చేసిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 24 మంది నక్సలైట్లు మరణించారు" అని షా ఎక్స్  లో పోస్ట్ చేశారు. లొంగిపోని నక్సలైట్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని కేంద్ర హోంమంత్రి నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం "నక్సలైట్ల రహితం" అవుతుందని షా అన్నారు. "మోదీ ప్రభుత్వం నక్సలైట్లపై క్రూరమైన విధానంతో ముందుకు సాగుతోంది. " అని ఆయన పేర్కొన్నారు.