calender_icon.png 16 April, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కుటుంబాల్లో గృహజ్యోతి

16-04-2025 01:02:11 AM

మానుకోట జిల్లాలో వెలుగులు

పేదలకు రూ.32.06 కోట్ల లబ్ది

మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గత ఏడాది మార్చి 1 నుంచి గృహ జ్యోతి పథకం ద్వారా పేద కుటుంబా నికి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా గడచిన ఏడాది కాలంలో మహబూబా బాద్ జిల్లాలో 1,04,910 మంది పేద కుటుంబాల్లో ‘గృహజ్యోతి’ ఉచిత వెలుగులు నింపింది.

ఈ ఏడాది జనవరి చివరి వరకు 3,206.81 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చిందని ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్, తొర్రూర్ డివిజన్ ఇంజనీర్లు విజయ్, మధుసూదన్ తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న గృహ జ్యోతి లబ్ధిదారులు ఒక్క రూపాయి చెల్లించకుండా ఉచిత విద్యుత్తు పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా గృహ జ్యోతి పథకంలో ఉచిత విద్యుత్ పథకాన్ని పొందిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తొర్రూర్ మండల పరిధిలో గృహజ్యోతి లబ్ధిదారులు 9,695 ఉండగా, 316.82 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది.

అలాగే పెద్ద వంగరలో 3,888 కి 103.80, దంతాలపల్లి లో 4,209కి 118.02, నరసింహుల పేటలో 3,030కి 98.64, మరిపెడలో 7,287కు 226.69, చిన్న గూడూరులో 2,088కి 61.83, నెల్లికుదురులో 7,001కి 188.51, మహబూబాబాద్ పట్టణ పరిధిలో 7,885 కు 2,227.88, మహబూబాబాద్ గ్రామీణ పరిధిలో 8,110కి 226.95, కేసముద్రం మండల పరిధిలో 5,332కు 172.42, ఇనుగుర్తి లో 3,684 కు 94.85,  గూడూరు లో 3,719కి 93.65, కొత్తగూడలో 5,735కు 119.87, కురవిలో 4,504కు 134.92, సీరోల్ లో 3,362కు 93.50, డోర్నకల్ లో 7,746కు.284.13, గార్లలో 6,034కు 179.12, అయోధ్య పురం పరిధిలో 3,737కి 87.84, కొత్తపేట పరిధిలో 7,863కు 218.31 లక్షల కోట్ల రూపాయల ఉచిత విద్యుత్తు ద్వారా పేద గృహ విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు

కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదా రులు గృహ జ్యోతి పథకంలో ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్తు పథకం కోసం మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కరెంట్ బిల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రజా పాలన దరఖాస్తు రసీదు తో దరఖాస్తు చేసుకుంటే ‘జీరో’ బిల్ పథకం అమలు చేస్తాం. 

- విజయ్, ఎన్పీడీసీఎల్, 

డివిజనల్ ఇంజినీర్

ఇంటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి

గృహ జ్యోతి పథకం అమలు చేయడం తో ఇంటి కరెంట్ బిల్లు చెల్లించే పరిస్థితి తొలగిపోయింది. ప్రతి నెలా చెల్లించాల్సిన కరెంటు బిల్లు డబ్బులు ఇప్పుడు ఇంటి అవ సరాలకు పనికొస్తున్నాయి. సామాన్యులకు కరెంటు బిల్లు తొలగించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా మారింది. 

- అనిత, గృహిణి, కేసముద్రం