calender_icon.png 27 April, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లే వ్యాయామశాల!

20-04-2025 12:00:00 AM

ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ఏకాగ్రత తగ్గింది. దాంతో శరీరానికి వ్యాయామం కరవవుతున్నది. అలాగని వ్యాయామానికి పూర్తిగా గుడ్‌బై చెప్పేస్తే ఎలా? ఫిట్‌నెస్ మాయమై, బద్దకం ఆవరించే ప్రమాదం ఉంది. అందుకే వ్యాయామ శిక్షకులు, వైద్యుల సూచనలతో ఇంట్లోనే వర్కవుట్స్ చేసుకోవచ్చు. ఆయాసం లేని ఆసనాలను ఒకసారి ప్రయత్నించి చూడండి.. 

సులువుగా, ఆయాసం లేకుండా చేసుకొనే చిన్న చిన్న యోగాలనాలివి. కానీ వీటివల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. భుజాలు, చేతులు, మెడ నరాలు, తుంటి, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీపు కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. వీలైతే ఒకసారి ప్రయత్నించండి..

గోముఖాసనం

సుఖాసనంలో కూరోండి. ఇప్పుడు ఎడమ పాదం కుడి పాదం కింద ఉంచి.. కుడి మోకాలు ఎడమ మోకాలిపై పెట్టండి. కుడి చేతిని కుడి భుజం పైనుంచి వెనక్కి తీసుకువెళ్లండి. ఎడమ చేయిని పక్క నుంచి వెనక్కి మడవండి. వెనకాల రెండు చేతి వేళ్లనూ ఒకదానితో ఒకటి పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచి, దీర్ఘశ్వాస తీసుకుంటూ.. వదులుతూ.. సాధ్యమైనంతసేపు అదే భంగిమలో ఉండండి. తర్వాత కాలు మార్చుతూ ఇలాగే ఐదారుసార్లు చేయాలి. 

హిప్ ట్విస్ట్

కూర్చొని కాళ్లు జాపండి. ఇప్పుడు ఎడమ కాలిని పూర్తిగా మడవండి. కుడి పాదాన్ని ఎడమ తొడపై నుంచి తీసుకువచ్చి, నేలపై పెట్టండి. వెన్నెముక, తల నిటారుగా ఉంచి, శ్వాస తీసుకోండి. ఇదే విధంగా కాళ్లు మార్చి చేయండి. ఇలా ఐదుసార్లు చేస్తే మంచిది. 

 సీకుర్తి సంధ్య రెడ్డి
ఎస్‌ఎస్‌ఆర్ హ్యాపీ ఫిట్‌నెస్ ట్రైనింగ్ స్టూడియో
హైదరాబాద్