కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు వేతనాలు పెంచడంతో బుధవారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి హోంగార్డుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో హోంగార్డులు నిర్వహిస్తున్న సేవలను గుర్తించి వేతనాలను ప్రభుత్వం పెంచడం సంతోషంగా ఉందన్నారు. మరింత ఉత్సాహంతో విధులను నిర్వహించి పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని హోంగార్డులు పాల్గొన్నారు.