మామునూరు: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ హోంగార్డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి మామునూరు జ్యోతిబా పూలే పాఠశాల ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. మామునూరు 4వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వడ్డేపల్లి సుధాకర్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదలో హోం గార్డ్ శరీరం ఛిద్రం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.