22-12-2024 01:05:36 AM
విధుల్లోకి తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : ఎల్బీస్టేడియం వద్ద శనివారం ఉదయం మాజీ హోంగార్డు వీరాంజనేయులు హల్‌చల్ చేశాడు. రోడ్డుమీద పడిన తమ జీవితాలను ఆదుకోవాలని సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉమ్మడి రాష్ట్రంలో తనతో సహా 250 మంది హోంగార్డులను అన్యాయంగా తొలగించారన్నాడు. నేను పదేండ్ల పాటు అన్ని డిపార్ట్‌మెంట్‌లలో విధులు నిర్వహించాను.
అయితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కగట్టి విధుల నుంచి తొలగించింది. మా అందరికీ గుర్తింపుగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి లెటర్స్, బ్యాంకు అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఏడాది గడుస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వీరాంజేనేయులు టవర్ దిగి కిందకు వచ్చాడు.