26-02-2025 12:16:15 AM
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల కాంబోలో రూపొందిన ‘ఎల్2ఈ ఎంపు రాన్’ మార్చి 27న రాబోతోంది. 2019లో ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘లూసిఫర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎంపురాన్’ రూపొందుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ అంచనాలను మేకర్స్ పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ చిత్రంలో బోరిస్ ఆలివర్ అనే కీలక పాత్రను పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఐకానిక్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో బ్రోన్ పాత్రను పోషించిన జెరోమ్ ఫ్లిన్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
‘ఎంపురాన్’లో నటించడంపై జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ.. “నేను యూకే, యూఎస్‌లో గడిపిన దానికంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని పొందాను. మాలీవుడ్ కల్చర్‌లో భాగ మైనందుకు చాలా సంతోషంగా ఉంది. మాలీవుడ్ సంస్కృతిలో భాగం కావడం, ఇక్కడి రు చుల్ని ఆస్వాదించడం నిజంగా ఆనందంగా ఉంది” అన్నారు.
ఈ చిత్రంలో మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ తదితరులు నటించా రు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ కలిసి లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.