25-02-2025 08:17:34 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలకు, కళాశాలలకు ఈనెల 26, 27న సెలవు ప్రకటించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కు ముందు రోజు 26న పోలింగ్ ఏర్పాట్ల కోసం సెలవు ప్రకటించగా, 27న ఎన్నికల నిర్వహణ కోసం సెలవు ప్రకటించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.