మెదక్,(విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యాసంస్థల సమాచారాన్ని విద్యాశాఖ అధికారి ద్వారా తెలుసుకుంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అధిక వర్షాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని అత్యవసర పరిస్థితి వస్తే తప్పించి బయటికి వెళ్ళవద్దని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలకు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేయు విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9391942254 కంట్రోల్ రూము నంబర్కు కాల్ చేయాలని తెలిపారు.