calender_icon.png 19 April, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోలీ వేడుకకు 1.22 లక్షలు

18-04-2025 11:47:56 PM

హిమాచల్‌లో సీనియర్ ఐఏఎస్ నిర్వాకం

హాజరైన 75 మంది అధికారులు, వారి కుటుంబాలు

అధికారి తీరుపై బీజేపీ అసహనం

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా తీరుపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ప్రబోధ్ సక్సేనా హోలీ వేడుకలకు రూ. 1.22 లక్షలు ఖర్చు చేశారు. తర్వాత ఈ మొత్తం చెల్లించాలని ప్రభుత్వానికి పంపాడు. ఆయన తన తోటి అధికారులు, వారి కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ విందుకు 75 మంది అధికారులు వారి కుటుంబాలతో హాజరయ్యారు. పదవీవిరమణ పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కొందరు కూడా వచ్చారు. ఇలా ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసిన చీఫ్ సెక్రటరీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విందు బిల్లు కాపీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రబోధ్ సక్సేనా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హిమాచల్‌కు చీఫ్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది.