calender_icon.png 16 March, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతకు ప్రతీక హోలీ: ఎస్పీ గిరిధర్

15-03-2025 12:54:22 AM

వనపర్తి టౌన్ మార్చి 14: హోలీ పండుగ వేళ అందరూ ఐక్యంగా ఎలాంటి తారతమ్య  వయో భేదం లేకుండా ఆనందంగా జరుపుకునే సంబరం హోళీ అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.శుక్రవారం రోజు ఉదయం జిల్లా పోలీసు  కార్యాలయముకు చేరుకున్న అధికారులు సిబ్బంది ముందుగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకుని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి రంగులతో సామాజిక ఐక్యతతో ఆనందాన్నివ్యక్తపరిచే పండుగగా ఆయన అభివర్ణించారు.

ఉట్టి కొట్టడం లాంటి ఒక వేడుకను నిర్వహించి అందులో విజేత అయిన కు ఐదు వేల రూపాయల నగదు బహుమతి ని ఎస్పీ రావుల గిరిధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు , స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, వనపర్తి సిఐ, కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,   ఎస్త్స్రలు,  జర్నలిస్టలు, పోలీసు సిబ్బంది, అధిక సంఖ్యలో  హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.