calender_icon.png 15 March, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హోలీ వేడుకలు

14-03-2025 07:29:43 PM

మందమర్రి,(విజయక్రాంతి): రంగుల కేళి హోలీ వేడుకలు పట్టణంలో, మండలంలోనీ పలు గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే సహజ సిద్ధమైన రంగులతో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ  సందర్భంగా చిన్నారులు ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుంటూ సంబరాలు నిర్వహించారు. యువకులు, మహిళలు సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా  పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.