14-03-2025 08:37:24 PM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్,(విజయక్రాంతి): హోలీ అందరి జీవితాలను రంగులతో నింపాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(Musheerabad MLA Muta Gopal) అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లోని ఇందిరాపార్క్ వాకర్ అసోసియేషన్(Indira Park Walkers Association) ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ హోలీ అందరి జీవితాలను రంగులతో నింపాలని, హోలీ కష్టాలన్నీ తొలగించాలని జీవితం ఆనందమే కావాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ, కార్పొరేటర్ రచన శ్రీ, వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రభాకర్ యాదవ్, నరేందర్ రెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు రాంచందర్, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
ముషీరాబాద్ లో ఘనంగా హోలీ వేడుకలు..
ముషీరాబాద్ నియోజకవర్గంలో హోలీ పండుగ వేడుకలు అంబరాన్నాంటాయి. నియోజకవర్గంలోని కవాడిగూడ, గాంధీనగర్, ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్, భోలక్ పూర్ డివిజన్లో వివిధ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు, పెద్దలు అన్ని వర్గాల ప్రజలు ఒకరికొకరు రంగుల చల్లుకొని ఆలింగనం చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలారు.