calender_icon.png 15 March, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ కార్మికులతో ఘనంగా హోలీ వేడుకలు

15-03-2025 12:00:00 AM

ముషీరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికు లతో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ శుక్రవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ హోలీ పండుగ  పేద, గొప్ప, కులం- మతం, చిన్న, పెద్ద ఆన్న తారతమ్యాలు లేకుండా, ప్రేమ, అభిమానం, ఆప్యాతలకు ప్రతీకగా సప్తవర్ణ రంగులు ఒకరికొకరు  పుసుకొనే వేడుక హోలీ అని అన్నారు.

ఈ రంగుల హోలీ పండగ అందరి జీవితాలను సుఖసంతోషాలతో రంగుల మయం చేయాలని ఆశీస్తూ అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ  సికింద్రా బాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ జీహెచ్‌ఎంజీ మహిళా పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు విజయ్ కుమార్, నర్సింగరావు, ఎస్ ఎఫ్ ఏలు, రాజ్ కుమార్, సోమేష్,గోపాల కృష్ణ,శివ కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.