calender_icon.png 16 March, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో ఘనంగా హోలీ వేడుకలు

15-03-2025 12:00:00 AM

కాటారం, మార్చి 14 (విజయక్రాంతి): కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఘనంగా హోలీ వేడుకలు కాలనీ వాసులు అందరు కలిసి జరుపుకున్నారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంతోషకరమైన వాతావరణంలో  హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్బంగా కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ హోలీ పండుగ హిందూ పురాణాల ప్రకారం చెడు పై మంచి, విజయం, భక్తినీ, నిరంకుశత్వంపై గెలిపించిన కథను గుర్తుచేస్తూ రంగుల పండగ హోలీని జరుపుకుంటామని, అలాగే  సహజ సిద్ధమైన  రంగులను  వాడుతూ ఆనందోత్సాహాల మధ్య  హోలీ పండుగను  జరుపుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదర్శనగర్ కాలనీ కన్వీనర్ ఆత్మకూరి కుమార్ యాదవ్, కుమ్మరి అశోక్, పెనుగొండ బాపు, వెనుగంటి శశిధర్ రెడ్డి, దుంపల నవీన్, మరుపాక రాజు తదితరులు పాల్గొన్నారు. కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో అంబరన్నంటిన హోలీ సంబరాలు చిన్నా ,పెద్ద అంతా హోలీ సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఈ కార్యక్రమంలో మహా ముత్తారం డిప్యూటీ తాసిల్దార్ సందీప్, ఆర్‌ఐ భాస్కర్, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.