15-03-2025 12:00:00 AM
జనగామ జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు
రంగులతో కేరింతలు కొట్టిన యువత
ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్, డీసీపీ
జనగామ, మార్చి 14(విజయక్రాంతి): జనగామ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు, చిన్నారులు ఉదయం నుంచే వీధుల్లో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను శుభారంభం చేశారు. జనగామ పట్టణంతో పాటు పల్లెల్లో వివిధ కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. జనగామ కలెక్టర్ కార్యాలయం, డీసీపీ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్‌ను జనగామ డీసీపీ రాజమ హేంద్రనాయక్ కలిసి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జర్నలిస్టులు కలెక్టర్‌తో పాటు డీసీపీని కలిసి రంగులు పూశారు.
కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, జనగామ, నర్మెట సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్య, జనగామ పట్టణ ఎస్త్స్రలు చెన్నకేశవులు, రాజేశ్, రాజన్‌బాబు, భరత్ డీజే పాటలకు డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరించారు. మరోవైపు జనగామ సీఐ దామోదర్‌రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఉత్సవాల్లో పాల్గొని వారిలో ఉత్తేజాన్ని నింపారు. ఇక కాలనీల్లో మహిళలు సైతం వేడుకల్లో సందడి చేశారు.