14-03-2025 07:36:12 PM
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలయ్య ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ.ఎస్.ఐ సమ్మిరెడ్డి తో హోలీ సంబరాల్లో పోలీసులతో , యువకులతో గ్రామ ప్రజలంతా మమేకమై ఆనందంగా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు చింతల రమేష్, కొత్తపల్లి రామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్, ఉపాధ్యక్షులు పుల్ల రవితేజ, బోళ్ల రాజేందర్, ఎస్ రాజేందర్, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.