14-03-2025 04:48:43 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే పట్టణంలోని పలు వార్డులను యువకులు బ్యాండ్ మేళాలు మోగిస్తూ రంగులను చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లి తిలకు క్రీడా మైదానంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి చిన్నారులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు.
పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్యవైశ్యులు రంగులు చల్లుకుంటూ వేడుకలు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రవి కుమార్ తో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు , పోలీసులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బజార్ ఏరియాలో వికె స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణంలోని వ్యాపారస్తులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్టెప్పులేస్తూ రంగులు చల్లుకొని హోలీ వేడుకలను జరుపుకున్నారు. పలుచోట్ల వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు , నాయకులు, యువకులు అంబరాన్నంటేలా జరుపుకున్నారు.