calender_icon.png 14 March, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోలీ సంబరాలు

14-03-2025 05:39:25 PM

వేడుకల్లో పాల్గొన్న సిపి అంబర్‌ కిషోర్‌ ఝా

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌(Ramagundam Police Commissionerate) కార్యాలయములో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను  పురస్కరించుకొని,  కమిషనరేట్‌ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా(Ramagundam CP Amber Kishore Jha)కి రంగులు పూశారు. ఈ సందర్బంగా సీపీ అధికారులు,సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు, బ్యాండ్‌ వాయిద్యాలతో పోలీస్‌ కమిషనర్‌, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందం తో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్‌ కమిషనర్ మిఠాయిలను అందజేసారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, ఈహోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు. ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిప్ ఎ,బాస్కర్,  అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి  రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్ , ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్ల రెడ్డి , ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, సిసి హరీష్, ఎస్‌.ఐ, ఆర్ ఎస్ఐ లు  ఇతర పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.