14-03-2025 04:56:19 PM
మేడ్చల్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంట్లో హోలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు. మల్లారెడ్డి స్టెప్పులేసి అక్కడివారిని ఉత్సాహపరిచారు. చిన్నపిల్లడిలా మారిపోయారు. మనుమరాలను భుజాన కూర్చోబెట్టుకొని డాన్స్ చేశారు. అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కి, తన భార్యకు రంగులు చల్లారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.