15-03-2025 12:40:54 AM
పెబ్బేరు మార్చి 14: పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాలు, పెబ్బేరు మున్సి పాలిటీలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా రంగులమయంగా మారిపోయాయి రోడ్లన్నీ. ప్రతీ ఒక్కరూ కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ వేడుకల్లో మునిగితేలారు. హోలీ సందర్బంగా మహిళలు, చిన్న, పెద్ద తేడా లేకుండా ఒకరికి ఒకరు రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోని ఆనందహోలీ జరుపుకున్నారు. చిన్నా రులు రంగులు చల్లుకొని సరదాగా హోలీ సంబరాలను జరుపుకుంటూ ఆనందంలో మునిగితేలారు.