calender_icon.png 17 March, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరూ.. వాడ రంగులాట

15-03-2025 12:51:32 AM

 జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురం

 కేరింతలు కొడుతూ రంగులు పులుముకున్న యువత

 వీధుల్లో సందడి చేసిన చిన్నారులు

సూర్యాపేట, మార్చి14 (విజయక్రాంతి): ఊరూ.. వాడా రంగుల పండుగను అంబరాన్నంటేలా జరుపుకున్నారు. వయసు తారతమ్యాన్ని మరిచి.. స్థాయిలను విస్మరించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సప్తవర్ణ రంగులను చేతులకు పులుముకొని ఆనంద డోలికల్లో మునిగి తేలారు. కేరింతలు కొడుతూ.. ఈలలు వేస్తూ.. నీళ్లు చల్లుకుంటూ.. డీజే మోతల నడుమ  నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గురువారం అర్ధరాత్రి కామ దహనాన్ని నిర్వహించి.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే చిన్నారులు, యువతీ యువకులు రంగులతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. రంగులు పూసుకుంటూ అవధులు లేని సంతోషంతో సంబురంగా వేడుకలు జరుపుకున్నారు. కలెక్టరేట్ లో అధికారులు, క  పోలీస్  కార్యాలయంలో  సిబ్బంది హోలీ వేడకలు నిర్వహించారు. అదే విదంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచదర్నాయక్ హోలి వేడుకల్లో పాల్గొన్నారు. 

హోలీ సంబరాల్లో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి మార్చి 14 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నలు, పెద్దలు, మహిళలు వయసులో  తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ సంబరాల్లో పాలుపంచుకున్నారు. యువత హోలీ సంబరాలను ఎంజాయ్ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకే హోలీ సంబరాలు జరుపుకోవాలని పోలీసులు ఆదేశించారు. మద్యం దుఃఖనాలు ముసి వేశారు. తుర్కపల్లి  మండలం బిల్యా నాయక్ తండాలో జరిగిన హోలీ సంబరాల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, పెద్ద మతం, కులం తేడా లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ హోలీ పండుగ అని అన్నారు .ప్రజలందరూ హోలీ పండుగ సందర్భంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి ,మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎలగల  రాజయ్య, నాయకులు దేవరుప్పల ఐలయ్య, బోరెడ్డి మహిపాల్ రెడ్డి, రాజారాం నాయక్, కానుగంటి శ్రీనివాస్ యాదవ్, పనగట్ల సుదర్శన్, వల్లపు రమేష్, రామగొని వెంకటేష్ గౌడ్, పట్టు నాయక్ ,డొంకని వెంకటేష్, నిఖిల్ గౌడ్, పాంగల బాలకృష్ణ, ఎరుకల వెంకటేష్ గౌడ్, సుగ్రీవ చారి, గురు శ్రీశైలం, గ్రామ శాఖ అధ్యక్షుడు సుధాకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి

సూర్యాపేట, మార్చి 14:రంగులు చిలికే పండుగ వేళ ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం హోళీ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ  మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్సీ విజయశాంతి లను కుటుంబ సమేతంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.   ప్రజలందరికీ సప్త వర్ణాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సూర్యాపేట మార్చి 14: రంగుల పండుగ ప్రజలంతా జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని 45 వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ అన్నారు. శుక్రవారం హోళీ పండుగ సందర్భంగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన్నీరు ప్రమీల, వర్దేల్లి పద్మలీల, సంఘమిత్ర, చామకూరి పద్మ, మాజీ సర్పంచ్ వాంకుడోతు పద్మ, రోజా, వాసా ఉమరాణి, తోట కవిత, ఇంద్ర, జ్యోతి, అంజలి, మాధవి, విజయలక్ష్మి, సైదమ్మ, సువర్ణ లక్ష్మి, మంజుల, హేమ పాల్గొన్నారు.

నల్లగొండలో 

నల్లగొండ, మార్చి 14 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందం పంచుకున్నారు. యువత నృత్యాల మధ్య రంగులు పులుముకుంటూ సంబురాల్లో మునిగిపోయారు. పట్టణాల్లో సామూహికంగా వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొని ఉత్సాహం నింపారు. నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడులో ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కుటుంబీకులతో కలిసి జిల్లా కేంద్రంలో వేడుకలు జరుపుకున్నారు.