calender_icon.png 16 March, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోలీ వేడుకలు

15-03-2025 12:00:00 AM

పెద్ద కొడప్గల్, మార్చి 14 ః కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు మండల వ్యాప్తంగా రంగురంగుల్లో హోలీ పండుగ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

హోలీ పండుగకు ఒక రోజు ముందు అన్ని గ్రామాలలో కామ దహనం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చిన్నారుల కేరింతల మధ్య కామ దహనం చేశారు

పెద్ద ఎక్లరా గ్రామంలో....

మద్నూర్, మార్చి 14 ః కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంతోపాటు, మండలంలోని గ్రామాల్లో హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్ద ఎక్లరా గ్రామంలో చిన్నారులు, యువత రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సందర్భంగా ఉదయం నుంచి హోలీ యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు.

యువతీ యువకులు రంగు లు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత నృత్యాలు చేస్తూ సం బురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నారులు రంగులు జల్లుకొని ఆనందంగా వేడుకలను ఆస్వాదిం చారు. అన్ని కలిసి ఉంటేనే కనులకు ముచ్చటగా ఉంటుందని.. అందరి జీవితాల్లో రంగులు నిండి సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరడం జరిగింది.