30-04-2025 12:11:18 AM
ప్రధానిని కోరిన రాహుల్ గాంధీ, ఖర్గే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రా హుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. రాహుల్ గాం ధీ, ఖర్గేలు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించా రు. ‘పహల్గాం ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసింది. పార్లమెంటు ఉభయసభల్లో ప్ర త్యేక సమావేశాలు ఏర్పా టు చేసి.. పహల్గాం దాడిపై చర్చించాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి’. అన్నారు.