25-04-2025 12:21:45 AM
లేని పక్షంలో ౧౦౦౦ మందితో ఆమరణ దీక్ష చెపడుతాం
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : బిసి రిజర్వేషన్ లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 1000 మందితో ఆమరణ నిరాహార దీక్షా జరుపుతామని, మంత్రు లు, మ్మెల్యేలను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నిక లు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయి దా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుపుతామన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్ర స్తావించకపోవడం దారుణం అన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయం పరిష్కారం కాకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్ళితే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ లో చేసిన చట్టానికి ఇంతవరకు ప్రభుత్వ జిఓ జారీ కాలేదన్నారు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రానికి పంపుతామని వెలువడ్డ ప్రకటనలకు ఆతీ గతి లేదన్నారు. రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కావున న్యాయ నిపుణులతో చర్చించి జిఓ తీసి వెంటనే ఎన్నికలు జరపాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు జి.అంజి, మణికంఠ, రాజు నేత, నరసింహ గౌడ్, రవికుమార్, ఎస్.లక్ష్మీనారాయణ, ఫణి తదితరులు పాల్గొన్నారు.