21-02-2025 01:06:26 AM
ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అంశంలో మరోసారి పొరపాట్లు జరగకుండా షమీమ్ అక్తర్ కమిషన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 10వ తేదీ గడువును సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇ వ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మం ద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను మార్చి 1 నుంచి కాకుండా 10వ తేదీ తర్వాత నిర్వహించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలోని లోపాలను సరి చేయాలని కోరుతూ గురువారం కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మా ట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన షమీమ్ అక్తర్ కమిషన్‌కు మార్చి 10 దాకా గడువు పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞత లు తెలిపారు. గత నివేదకలోని లోపాలను సరి చేయడానికి మార్చి 10 వరకు అవకాశం ఇవ్వాలన్నారు.
మార్చి 1 నుంచి నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వర్గీకరణ ఆమోదం అయితే మళ్లీ లోపాలు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుని మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, మాజీ ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు.