న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం ఆశోక్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. సోమవారం తన ఇంట్లోనే ఛాతిలో నొప్పితో విలవిల్లాడడంతో అశోక్ కుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నా రు. యాంజియోప్లాస్టీ ఆపరేషన్ నిర్వహించామని.. ప్రస్తుతం అశోక్ పరిస్థి తి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ కుమారుడైన అశోక్ కుమార్ 1975 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
అంతకముందు 1972 మునిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని హయాంలోనే 1971 బార్సిలోనా, 1973 ఆమ్స్టర్డామ్ ప్రపంచ కప్స్‌లో భారత్ కాంస్యాలు నెగ్గింది. ఆసియా గేమ్స్‌లోను వరుసగా మూడు రజతాలు నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు.