డీఎస్‌ఈకు తపస్ విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ విధుల నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మిన హాయింపునివ్వాలని తెలంగాణ ప్రాం త ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ కోరారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.వి.నర్సింహారెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యాయుల ను బోధనకు మాత్రమే పరిమితం చే యాలని వారు విజ్ఞప్తి చేశారు. మధ్యా హ్న భోజన పథకం ఏజెన్సీలతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమన్వయం చేసుకుంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని అధికారుల ఆదేశాలతో టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు.
ఇప్పటికే సస్పెండ్ అయిన హెచ్‌ఎం, టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎటూ సరిపోవడం లేదని, కూరగాయలు, గుడ్డు ధరలు పెరిగాయని తెలిపారు.