హైదరాబాద్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ తమ కంపెనీకి మంజూరు చేసిప రూ.160 కోట్ల విలువైన వివిధ రుణాలకు హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆమోదం తెలిపింది. ఫ్రోజెన్ బోన్‌లెస్ బీఫ్ మీట్ స్లాటరింగ్, చిల్లింగ్, ప్రాసెసింగ్ ఫ్రీజింగ్, ప్యాకింగ్‌కు సంబంధించి రైయాన్ ఎక్స్‌పోర్ట్‌కు చెందిన సదుపాయాలను ఉపయో గించుకోవడానికి తాము ఆ సంస్థ తో ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఇటీవల హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ బోర్డు ప్రకటించింది.
అలాగే మలేషియాకు చెందిన కేమజువాన్ పర్టనియాన్ సెలాంగోర్ ( పీకేపీఎస్)తో కూడా కంపెనీ ఇంతకు ముందు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రోజెన్ బోన్‌లెస్ బీఫ్ మీట్‌ను ఎగుమతి చేయడంతోపాటు ఇతర రంగాల్లో రెండు కంపెనీలు సహకరించుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
అంతేకాకుండా పీకేపీఎస్ మద్దతుతో మలేషియాతో పాటుగా ఇతర ఆసియా మార్కెట్లలోనూ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హెచ్‌ఎంఏ తన పంపిణీ సామర్థ్యాలను పెంచుకుంది. హెచ్‌ఎంఏ ఫ్రోజెన్ బీఫ్ మీట్‌తోపాటు ఇతర సహజ ఉత్పత్తులు, పండ్లు కూరగాయలు, పప్పుధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు అందిస్తోంది. రోజుకు 1472 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉంది.